గత ఏడాది టాప్ హిట్స్ లో చోటు దక్కించుకున్న మహానటితో కీర్తి సురేష్ రేంజ్ పెరిగింది. అయితే తను మాత్రం సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరితో మాస్ సినిమాల్లో రొటీన్ వేషాలే వేసుకుంటూ నెట్టుకొస్తోంది. విశాల్ తో పందెం కోడి 2 ,విక్రంతో సామీ స్క్వేర్ సూర్యతో గ్యాంగ్ ఇలా అందరు స్టార్ హీరోలతోనే చేసింది కాని వాటి వల్ల ఆమెకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కీర్తి రేంజ్ కు తగ్గ పాత్రలు రావడం లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ అడుగులు బాలీవుడ్ వైపు పడుతున్నాయని టాక్. శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాతగా త్వరలో రూపొందబోయే ఓ హీరొయిన్ ఓరియెంటెడ్ మూవీలో తనకు ఆఫర్ దక్కినట్టు సమాచారం. గత ఏడాది ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బధాయి హో దర్శకుడు అమిత్ శర్మ దీన్ని టేకప్ చేయబోతున్నట్టు , బధాయిహో తరహాలో మరో వినూత్నమైన ప్రాజెక్ట్ అమిత్ శర్మ రెడీ చేసాడని ఎవరూ ఊహించని పాత్ర కాబట్టే ఛాలెంజ్ గా అనిపించి కీర్తి సురేష్ ఒప్పుకుందని చెన్నై టాక్.